News22nd May 10:30 AMSunil Byrisetty1 min read

సిద్దేశ్వరం అలుగుకై చలో సంగమేశ్వరం

రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మే నెల 31న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన తొమ్మిదో వార్షికోత్సవ సంగమేశ్వర సభను జయప్రదం చేయాలని రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీ

సిద్దేశ్వరం అలుగుకై చలో సంగమేశ్వరం
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మే నెల 31న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన తొమ్మిదో వార్షికోత్సవ సంగమేశ్వర సభను జయప్రదం చేయాలని రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట పోస్టర్లు విడుదల చేశారు. ఆర్ .వి.యస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల జగదీష్ మాట్లాడుతూ.. ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కడపలో ఎర్రచందన ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, రాయలసీమ వ్యాప్తంగా మూతపడిన పరిశ్రమలను తెరిపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా రాయలసీమ త్రాగునీరు సాగునీటికే పరిమితం చేయాలని కృష్ణానది యాజమాన్య కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిరక్షణకు మరమ్మతులతో పాటు పూడిక తీసిరిజర్వాయర్ జీవితకాలం పెంచడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణంకై మే 31న సంగమేశ్వరం దగ్గర భారీ బహిరంగ సభ
Andhra Pradesh
Rayalaseema
Sangameswaram program
Siddheshwaram
సిద్దేశ్వరం అలుగుకై చలో సంగమేశ్వరం
31న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన
సాగునీరు త్రాగునీరు
Scroll for the next article