News8th Dec 12:53 PMSunil Byrisetty1 min read
మన హస్తకళా వైభవం.. సాంస్కృతిక సౌరభం
మన హస్తకళా వైభవం.. సాంస్కృతిక సౌరభాలకు నెలవని.. హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో కృషిచేస్తోందని,
మన హస్తకళా వైభవం.. సాంస్కృతిక సౌరభాలకు నెలవని.. హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో కృషిచేస్తోందని, ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ హస్తకళా వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌డీసీ) ఛైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ లేపాక్షి ఎంపోరియంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ హస్తకళా వారోత్సవాల్లో భాగంగా ఏపీహెచ్‌డీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10న వైఎస్ఆర్ కడప జిల్లా, వోనిపెంటలో గురుశిష్య హస్త్‌శిల్ప్ ప్రశిక్షణ్ ప్రోగ్రామ్ (జీఎస్‌హెచ్‌పీపీ) ద్వారా 30 మంది ఇత్తడి, కంచులోహపు హస్తకళాకారులకు శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా, దుర్గిలో 30 మంది కళాకారులకు డిజైన్ అభివృద్ధి వర్క్‌షాప్, 13న తిరుపతి జిల్లా, మాధవమాల, శ్రీకాళహస్తిలో కలప చెక్క కళాకారులకు టూల్ కిట్ల పంపిణీ, 14న అనకాపల్లి జిల్లా, కె.డి.పేటలో 50 మంది కళాకారులకు టూల్‌కిట్ల పంపిణీ, డిసెంబర్ 15-21లో రాజమహేంద్రవరంలో 40 మంది కళాకారులతో ఏడు రోజుల గాంధీ శిల్ప్ బజార్, 17న నంద్యాల జిల్లా, ఆల్లగడ్డలో 50 మంది శిలా శిల్పకళాకారులకు టూల్‌కిట్ల పంపిణీ ఉంటుందన్నారు.