Entertainment16th Aug 04:14 PMSunil Byrisetty1 min read

బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు ప్రముఖులు

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్యతేజ వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ

బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు ప్రముఖులు
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్యతేజ వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, నాగచైతన్య, మంచు విష్ణు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుమార్తెను చూసి బండ్ల గణేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వేడుకకు షాద్‌నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హాజరై జనని, సూర్యతేజలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
Hyderabad
Bandla Ganesh
Janani
Suryateja
JRC Convention Centre
Chiranjeevi
Nagarjuna
Naga Chaitanya
రేవంత్ రెడ్డి
సినీ ప్రముఖులు
వివాహ వేడుక
టాలీవుడ్
Scroll for the next article