Entertainment19th Oct 09:10 AMSunil Byrisetty1 min read
బండ్ల గణేష్ ఇంట మెగా దీపావళి వేడుక
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన ఇంట్లో 'బండ్ల దివాళీ 2025' పేరుతో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిర
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన ఇంట్లో 'బండ్ల దివాళీ 2025' పేరుతో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో పాటు పలువురు స్టార్ హీరోలు, దర్శకులు హాజరయ్యారు. దర్శకుడు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి రాక అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 20 మంది డైరెక్టర్ అనేకమంది ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రతీ ఏడాది దీపావళి పండగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. 'బండ్ల దివాళీ 2025' పేరుతో పార్టీ ఏర్పాటు చేసి ఈసారి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు పలువురు సినీ ప్రముఖులు సంబరాల్లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బండ్ల గణేష్ దీపావళి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. చిరుకి ఎదురెళ్లి బండ్ల గణేష్ ఆయన కాళ్లకి నమస్కరించారు.