Entertainment27th Jan 04:51 PMSunil Byrisetty1 min read

విజయ్ జన నాయగన్ విడుదలకు చిక్కులు!

తమిళ హీరో విజయ్ "జన నాయగన్" సినిమాకు సినిమా కష్టాలు ఎదురవుతున్నాయి. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింద

విజయ్ జన నాయగన్ విడుదలకు చిక్కులు!
తమిళ హీరో విజయ్ "జన నాయగన్" సినిమాకు సినిమా కష్టాలు ఎదురవుతున్నాయి. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ వివాదాన్ని బోర్డు దగ్గరే తేల్చుకోవాలని చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు జన నాయగన్ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో U/A సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తున్న సమయంలో ఆయన సినిమాకు ఎదురవుతున్న చిక్కులు తలనొప్పిగా మారుతున్నాయి.
Tamil Nadu Elections
Vijay
Jana Nayagan
Tamil Cinema
Movie Release Issues
Censor Board
U/A Certificate
Madras High Court
Chief Justice Bench
Legal Trouble
Kollywood News
Scroll for the next article