News31st Oct 12:41 PMSunil Byrisetty1 min read

జనగణనకు షెడ్యూల్ ఖరారు

జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలు స

జనగణనకు షెడ్యూల్ ఖరారు
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలు సేకరించడానికి ముందే పౌరులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని ఆప్షనల్ కల్పించారు. 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు ప్రజలు తమంతట తామే వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు సిబ్బంది ప్రత్యక్షంగా వివరాలు సేకరిస్తారు. అలాగే, జనగణన ముగిసిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకునేందుకు మార్చి 1 నుంచి మార్చి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నట్లు కేంద్రం నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. జనగణనకు రిఫరెన్స్ తేదీగా వచ్చే ఏడాది మార్చి 1ని నిర్ణయించారు. అయితే, ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు ప్రభావం ఎక్కువ ఉండే ప్రాంతాలకు ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించనుంది.
Scroll for the next article