National12th Jul 12:36 PMSunil Byrisetty1 min read
జస్టిస్ యశ్వంత్ అభిశంసన కోసం సంతకాలు
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా కరెన్సీ కట్టలు దొరకడంతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన్ను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. పార్లమెంట్లో
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా కరెన్సీ కట్టలు దొరకడంతో
వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన్ను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.
పార్లమెంట్లో అభిశంసన ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రారంభించింది. లోక సభలో 100మంది, రాజ్య సభలో 50మంది సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. మార్చిలో ఢిల్లీలోని ఆయన నివాసంలో నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంలో ఇప్పటికే సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది.