News12th Nov 05:30 PMSunil Byrisetty1 min read
రైతులు, చిన్న వ్యాపార సంస్థలకు కేంద్ర కేబినెట్ భరోసా
రైతుల ప్రయోజనాలు, చిన్న వ్యాపార సంస్థల అభివృద్ధి, భారతదేశ చారిత్రక వారసత్వ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రస్తావి
రైతుల ప్రయోజనాలు, చిన్న వ్యాపార సంస్థల అభివృద్ధి, భారతదేశ చారిత్రక వారసత్వ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రస్తావించారు. రబీ సీజన్‌లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా సబ్సిడీ కోసం రూ.62,370 కోట్లు కేటాయించడం, చిన్న సంస్థలకు రుణ సదుపాయాల కోసం రూ.5,000 కోట్లు కేటాయించడం ద్వారా వ్యవసాయ రంగానికి, చిన్న వ్యాపార సంస్థలకు ఆర్థిక సహకారం అందించే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నూతన ఢిల్లీ చారిత్రక నార్త్, సౌత్ బ్లాక్ భవనాలను ఆధునిక సాంకేతికతతో ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేయడం భారతీయ చరిత్ర, సంస్కృతి, నాగరికతా వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేసే కార్యక్రమంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,230 కోట్ల వ్యయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. భారతదేశ అభివృద్ధిలో రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.