Politics16th Apr 09:48 AMSunil Byrisetty1 min read
విచారణకు విజయసాయి.. ఆ స్థానంలో ఉప ఎన్నిక!
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మద్యం కుంభకోణంలో సిట్ ఆయనకు నోటీసులు జారీ చేయగా, విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఆయన రాజీనామా
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
మద్యం కుంభకోణంలో సిట్ ఆయనకు నోటీసులు జారీ చేయగా, విచారణకు హాజరు కావాల్సి ఉంది.
మరోవైపు ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానాన్ని భర్తీ చేసే ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు.
29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీ లన ఉంటుంది.
మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది.
అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. 13వ తేదీలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.