News16th Apr 09:12 AMSunil Byrisetty1 min read
ఏపీలో ఆర్థిక సంఘం బృందం పర్యటన
16వ ఆర్థిక సంఘం బృందం ఏపీలో పర్యటించనుంది. అందుకోసం పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం రాష్ట్రానికి చేరుకుంది. పనగారియా టీమ్‌కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికార
16వ ఆర్థిక సంఘం బృందం ఏపీలో పర్యటించనుంది.
అందుకోసం పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం రాష్ట్రానికి చేరుకుంది.
పనగారియా టీమ్‌కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న ఫైనాన్స్ కమిషన్ బృందం పలు అంశాలపై అధ్యయనం చేయనుంది.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతి నగరాల్లో పనగారియా బృందం సభ్యులు పర్యటించనున్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీంతో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల భేటీ కానున్నారు.
ఏపీ పర్యటన తర్వాత ఈ బృందం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపనుంది.