Farmers8th Sep 06:14 PMSunil Byrisetty1 min read
రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపద
రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎరువుల కేటాయింపు విషయంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నడ్డాతో ఫోన్లో మాట్లాడటంతోనే ఈ కేటాయింపు సాధ్యమైందని అధికారులు తెలిపారు.