Farmers13th Oct 05:02 PMSunil Byrisetty1 min read

ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు

రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో భారత ప్రభుత్వం ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్

ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో భారత ప్రభుత్వం ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. విజయవాడలోని భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు అధ్యక్షతన నిర్వహించారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతుకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 15.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేసామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఎఫ్ సీఐ నుంచి పంజాబ్ రాష్ట్రం తర్వాత 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10 % బ్రోకెన్ తో సేకరించడానికి అనుమతి ఉన్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
Andhra Pradesh
Kharif Season
Rice Procurement
Central Government
FCI
Food Corporation of India
Lavu Sri Krishna Devarayalu
కనీస మద్దతు ధర
వ్యవసాయం
ధాన్యం సేకరణ
Scroll for the next article