Business Type2nd Jul 05:20 PMSunil Byrisetty1 min read
రద్దీని బట్టి రేటు.. ఓలా, ఉబర్‌కు కేంద్రం గైడ్ లైన్స్
యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా తదితర సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీ ఉంటే రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మోటార్ వెహికిల్
యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా తదితర సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీ ఉంటే రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం నామమాత్రంగా రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీల్లో సగం సర్‌ఛార్జీ కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఒకవేళ రద్దీ విపరీతంగా ఉంటే 200 శాతం పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అంతకుముందు ఈ వెలుసుబాటు 150 శాతంగా ఉండేది. ఇక, మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదన్న షరతు విధించింది. యాప్ ద్వారా రైడ్‌ను అంగీకరించిన తర్వాత సరైన కారణం చెప్పకుండా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే.. ఛార్జీలో 10 శాతం పెనాల్టీ (రూ.100 మించకుండా) పడుతుంది. దానిని డ్రైవర్, అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ (ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు) చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, సరైన కారణం చెప్పకుండా ప్రయాణికులు రైడ్ క్యాన్సిల్ చేసినా ఇదే పెనాల్టీ వర్తిస్తుంది. ఇక డ్రైవర్ పికప్‌పాయింట్‌కు చేరుకోవడానికి ప్రయాణించే దూరం అంటే డెడ్ మైలేజ్‌కు ఛార్జీ విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే పికప్ పాయింట్ మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పుడే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ప్రయాణికుల భద్రతను నిర్ధరించేందుకు ఈ క్యాబ్ సంస్థల కింద సేవలు అందించే వాహనాలకు వెహికిల్ లొకేషన్, ట్రాకింగ్ పరికరాలు అమర్చడాన్ని తప్పనిసరి చేసింది.