News12th Jul 12:26 PMSunil Byrisetty1 min read
కోస్తా కనెక్టివిటీ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో అభివృద్ధి పరుగులు తీస్తోంది. తాజాగా ఏపీలో ఓ కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి మార్గం సుగమమైంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని
కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో అభివృద్ధి పరుగులు తీస్తోంది. తాజాగా ఏపీలో ఓ కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి మార్గం సుగమమైంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు కోస్టల్ హైవే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతి మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి తెలిపారు. 200 కిలోమీటర్ల మేర ఆరు లైన్లుగా దీనిని చేపట్టనున్నారు. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మధ్య రవాణాను సులభతరంతోపాటు వేగవంతం చేయనుంది.