National4th Jul 01:29 PMSunil Byrisetty1 min read

దేశవ్యతిరేక పోస్టులు పెడితే.. తాట తీస్తారు!

కేంద్ర హోం శాఖ కొత్త పాలసీ తేబోతోంది. ఈ పాలసీ గనుక అమలైతే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి చుక్కలు కనిపించనున్నాయి. ఈ పాలసీలో భాగంగా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో

దేశవ్యతిరేక పోస్టులు పెడితే.. తాట తీస్తారు!
కేంద్ర హోం శాఖ కొత్త పాలసీ తేబోతోంది. ఈ పాలసీ గనుక అమలైతే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి చుక్కలు కనిపించనున్నాయి. ఈ పాలసీలో భాగంగా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టే వీడియో, ఇతర కంటెంట్‌ను గుర్తించనున్నారు. వాటిని బ్లాక్ చేయనున్నారు. ఆ కంటెంట్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ ఉండే వెబ్ సైట్లపై కూడా చర్యలు ఉండనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని అత్యున్నతాధికారులు యాంటీ నేషనల్ పోస్టుల గురించి హోమ్ మినిస్ట్రీకి చెప్పారట. ఈ నేపథ్యంలోనే కేంద్ర కొత్త పాలసీ తేవాలని చూస్తోందట. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని, వ్యతిరేకంగా పని చేసే వారిని గుర్తించడానికి కేంద్రం ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టీమ్ దేశ వ్యతిరేక కార్యాకలాపాలపై దృష్టి పెడుతుంది.
India news
Central government
Union Home Ministry
against social media posts
Anti National Content
కంటెంట్ పెట్టిన వారిపై కఠిన చర్యలు
దేశానికి వ్యతిరేకంగా పోస్టులు
Scroll for the next article