News28th Jul 12:02 PMSunil Byrisetty1 min read
ఏపీలో 14 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు!
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో భాగంగా డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను (DCCC) ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రణ
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో భాగంగా డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను (DCCC) ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 200కి పైగా డీసీసీసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 14 కేంద్రాలు ఏపీలోనే ఉండనున్నాయని కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఒక్కో కేంద్రం స్థాపనకు సుమారు రూ.1.49 కోట్లు ఖర్చవుతుందని అంచనా. స్థలం, లాజిస్టిక్స్ లభ్యతకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఏపీలోని అనంతపురం, కర్నూలు, ప్రకాశం, ఎన్టీఆర్, కాకినాడ, నంద్యాల, బాపట్ల, విజయనగరం, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి, అన్నమయ్య, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.