News3rd Aug 11:49 AMSunil Byrisetty1 min read

జగ్గయ్యపేటకు మిసైల్స్‌ కేంద్రం!

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు మహర్దశ పడుతోంది. రక్షణ రంగ పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇప్పటికే బ్రహ్మోస

జగ్గయ్యపేటకు మిసైల్స్‌ కేంద్రం!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు మహర్దశ పడుతోంది. రక్షణ రంగ పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణుల తయారీ సంస్థ ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి, యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మరికొన్ని డిఫెన్స్ సంస్థలు కూడా ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. జగ్గయ్యపేట ప్రాంతంలో పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ వ్యూహాత్మక ప్రాంతం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతోపాటు రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉండి, అన్ని రకాలుగా అనుకూలంగా మారింది. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం కూడా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు దోహదపడుతోంది. ఇప్పటికే జయంతిపురంలో 800 ఎకరాలు, పెద్దవరంలో 1200 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి.
Andhra Pradesh Development
NTR District
Jaggayyapeta
Defense Industry
BrahMos Missiles
Defense Cluster
Employment Opportunities
Chandrababu Naidu
Central Government
Vijayawada-Hyderabad Highway
రక్షణరంగ పరిశ్రమలు
డిఫెన్స్ క్లస్టర్
జగ్గయ్యపేటకు మిసైల్స్‌ కేంద్రం
Scroll for the next article