News28th Jun 11:41 AMSunil Byrisetty1 min read

నిత్య విద్యార్థి చంద్రబాబు!

ఐటి గురించి అందరి కంటే ముందే ఆలోచించి.. లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పరిపాలనలో ఐటి వినియోగాన్ని ప

నిత్య విద్యార్థి చంద్రబాబు!
ఐటి గురించి అందరి కంటే ముందే ఆలోచించి.. లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పరిపాలనలో ఐటి వినియోగాన్ని ప్రారంభించింది చంద్రబాబు అని గుర్తు చేశారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అని 75 ఏళ్ల వయసులో మాట్లాడుతున్న నిత్య విద్యార్థి చంద్రబాబు అని కొనియాడారు. క్వాంటం కంప్యూటింగ్ చాలా ఖరీదైన వ్యవహారం అయినా.. ప్రజలకు మేలు చేయటం కోసం దాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మనం గంజాయి ఆలోచనలు చేస్తే అలాంటి బ్యాచ్ మన చుట్టూ చేరుతారని, అదే కృత్రిమ మేథ గురించి ఆలోచిస్తే పోలీసులు కూడా ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారని వివరించారు.
Andhra Pradesh news
Cm chandra babu
pemmasani chandrashekar
ai police
నిత్య విద్యార్థి చంద్రబాబు
లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు
Scroll for the next article