News9th Nov 11:57 AMSunil Byrisetty1 min read
ఏపీలో వైద్య సేవలపై కేంద్ర బృందం ప్రశంసలు
వైద్య, ఆరోగ్య శాఖ సేవలు రాష్ట్ర ప్రజలకు బాగా అందుతున్నాయని కేంద్ర వైద్య బందాలు ప్రశంసించాయి. మాతా శిశు సంరక్షణ సేవలు ప్రజలకు చేరువలో ఉన్నాయని, ఆసుపత్రుల్లో అందే చికిత్సలపట్ల ప్రజల
వైద్య, ఆరోగ్య శాఖ సేవలు రాష్ట్ర ప్రజలకు బాగా అందుతున్నాయని కేంద్ర వైద్య బందాలు ప్రశంసించాయి. మాతా శిశు సంరక్షణ సేవలు ప్రజలకు చేరువలో ఉన్నాయని, ఆసుపత్రుల్లో అందే చికిత్సలపట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారని కేంద్ర వైద్య బృందాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అవగాహన పెరిగినందున ఎన్‌సిడి స్క్రీనింగ్ కు స్పందన ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించాయి. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడం, గ్రాట్యుటీ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించాయి. ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, సిహెచ్‌వోలు స్థానికులతో మమేకమై సేవలందిస్తున్నారని కితాబునిచ్చాయి. కేంద్ర వైద్య బృందాలు (17వ కామన్ రివ్యూ మిషన్ )పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో 4 రోజుల చొప్పున విడివిడిగా ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా స్థాయిలోని ఆసుపత్రుల వరకు కలిపి 19 ఆసుపత్రులను సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించాయి. రోగులను మాత్రమే కాకుండా సమీప ప్రాంతాల్లోని స్థానికులను కలుసుకుని అందుతున్న సేవల గురించి కేంద్ర వైద్య బందాలు ఆరా తీశాయి.