News11th Nov 04:16 PMSunil Byrisetty1 min read

రానున్న రోజుల్లో 10 కోట్లు మంది లాక్ పతి దిదిలు

రానున్న రోజుల్లో 10 కోట్లు మందిని లాక్ పతి దిదిలుగా మార్చుటకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రతి ఏడాది లక్ష రూ

రానున్న రోజుల్లో 10 కోట్లు మంది లాక్ పతి దిదిలు
రానున్న రోజుల్లో 10 కోట్లు మందిని లాక్ పతి దిదిలుగా మార్చుటకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రతి ఏడాది లక్ష రూపాయల ఆదాయం కనీసం రావాలని, ప్రస్తుతం రెండు, మూడు కోట్లుగా ఉన్న లాక్ పతి దిదిల సంఖ్య పెంచుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటర్ షెడ్ మహోత్సవ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు రెండవ రోజు గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో మంగళవారం జరిగింది. ఈ జాతీయ సదస్సులో కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా స్వావలంబనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన క్రింద ప్రతి ఒక్కరూ పక్కా గృహం కలిగి ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు సర్వే నిర్వహించి ఏ ఒక్కరు గుడిసెల్లో ఉండకుండా చూడాలని సూచించారు. వివిధ కార్యక్రమాల క్రింద ఉత్పాదన పెంచే విధానం ఉందని, అందరూ మూడు పంటలు వేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు.
India Development
Lakhpati Didi
Rural Development
Women Empowerment
Shivraj Singh Chouhan
Watershed Mahotsav
Guntur
వ్యవసాయం
స్వావలంబన
ప్రధాని ఆవాస్ యోజన
భారత అభివృద్ధి
Scroll for the next article