News9th Dec 10:57 AMSunil Byrisetty1 min read

ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారులు

ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్‌కు ఎంపికైన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించింది. ఈ మేరకు రా

ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారులు
ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్‌కు ఎంపికైన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లేఖ రాసింది. రాష్ట్రకేడర్ కు కేటాయించినవారిలో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కె.ఆదిత్యశర్మ, చింతకింది శ్రవణ్కుమార్ రెడ్డి (తెలంగాణ), హరిఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హరియాణా), ప్రియ (దిల్లీ), సుయష్ కుమార్ (ఉత్త రప్రదేశ్)లు ఉన్నారు. ఏపీ స్వరాష్ట్రంగా ఉన్న చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డిని ఏజీఎంయూటీ, పి.సురేష్‌ను తెలంగాణ కేడర్కు కేటాయించారు. వీరు త్వరలో ఆంధ్రాలో రిపోర్ట్ చేయనున్నారు.
Andhra Pradesh
IAS 2024 Batch
IAS Allocation
Civil Services
Government Updates
Bureaucracy
ప్రభుత్వ నియామకాలు
సివిల్ సర్వీసెస్
ఏపీ గవర్నెన్స్
కొత్త ఐఏఎస్ పోస్టింగ్స్
Scroll for the next article