National28th Nov 03:42 PMSunil Byrisetty1 min read

స్వామియే శరణం అయ్యప్ప!

శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి

స్వామియే శరణం అయ్యప్ప!
శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు తమ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయాలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం NDA కూటమి ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.
India News
Ayyappa
Sabarimala
Irumudi
Aviation Ministry
Hindu Traditions
Devotee Convenience
NDA Government
Cultural Values
Scroll for the next article