News1st Apr 09:43 AMSunil Byrisetty1 min read
విశాఖ ఉక్కు.. బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ
విశాఖ ఉక్కు కర్మాగారం బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
విశాఖ ఉక్కు కర్మాగారం బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపింది.
ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైనా, తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చ జరిగింది.
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్)తో ప్లాంట్‌కు భద్రత కల్పించడానికి ముందుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు, 3వ ఫర్నేస్‌ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్(RINL)తో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేందుకు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, ఆర్ధిక సాయం ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఉక్కు కర్మాగారానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు.
ఇందుకు అవసరమైన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు.