News25th Mar 03:49 PMSunil Byrisetty1 min read

పెరిగిన ఎంపీల జీతాలు

ఎంపీల జీతభత్యాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కీలక మార్పులు చేసింది. వాటిని పెంచుతూ నిర్ణయం తీస

పెరిగిన ఎంపీల జీతాలు
ఎంపీల జీతభత్యాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కీలక మార్పులు చేసింది. వాటిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం లక్ష రూపాయలుగా ఉంది. దాన్ని లక్షా 24 వేలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే రోజువారీ అలవెన్సెస్‌ను రూ. 2 వేల నుంచి 2,500కు పెంచింది. పెన్షన్ విషయానికి వస్తే.. మాజీ సభ్యులకు ప్రతీ నెల 25 వేల పెన్షన్ అందుతోంది. దాన్ని 25 వేల నుంచి 31 వేలకు పెంచింది. సభ్యుల అదనపు పెన్షన్‌ 2 వేల నుంచి 2,500లకు పెంచింది. ఈ పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలు అవుతుంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా ఇటీవల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను పెంచింది. ముఖ్యమంత్రి నెల జీతం లక్ష ఉంటే.. పెంచిన జీతం ప్రకారం 2 లక్షలు అవుతుంది. కేంద్రం ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన ధరల దృష్ట్యా జీతాలు పెంచినట్లు పేర్కొంది.
Central Govt Increases Salary
Allowance For MPs
Scroll for the next article