News22nd Oct 02:54 PMSunil Byrisetty1 min read

గ్రామాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కేంద్రం అనుమతి

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలను గుర్తించేందుకు కేంద

గ్రామాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కేంద్రం అనుమతి
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలను గుర్తించేందుకు కేంద్ర గృహనిర్మాణశాఖ చేపట్టిన ఈ సర్వే గడువు దేశవ్యాప్తంగా రెండు నెలల క్రితమే ముగిసింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల మందికిపైగా పేదలు ఇళ్లు లేకుండా ఉన్నారని అధికారులు గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల నివేదించారు. దీనిపై స్పందించిన సీఎం..వెంటనే కేంద్రానికి లేఖ రాశారు. దీంతో తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో సర్వేకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. నవంబర్ 5 వరకు గడువిచ్చింది. అర్హులెవరైనా ఉంటే గృహనిర్మాణశాఖ ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Andhra Pradesh
Pradhan Mantri Awas Yojana
Rural Housing Scheme
Beneficiary Selection
Housing for Poor
కేంద్ర అనుమతి
సర్వే పొడిగింపు
సీఎం చంద్రబాబు నాయుడు
ఏఈ కార్యాలయాలు
Scroll for the next article