Health4th Aug 02:07 PMSunil Byrisetty1 min read

టూవీలర్ అంబులెన్సులకు కేంద్రం అనుమతి

అత్యవసర వైద్యాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం టూవీలర్ అంబులెన్సులకు అనుమతినిచ్చింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ద్విచక్ర వాహన అంబులెన్స

టూవీలర్ అంబులెన్సులకు కేంద్రం అనుమతి
అత్యవసర వైద్యాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం టూవీలర్ అంబులెన్సులకు అనుమతినిచ్చింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989కి సవరణలు ప్రతిపాదించింది. ద్విచక్ర వాహన అంబులెన్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నారు. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయడానికి 30 రోజుల సమయం కేటాయించారు. వాటిని పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Central Government
Two-Wheeler Ambulance
Bike Ambulance
Emergency Medical Services
Rural Healthcare
Motor Vehicle Rules
Healthcare
India
Ambulance Services
Public Health
Scroll for the next article