National17th Jan 12:30 PMSunil Byrisetty1 min read

242 బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం బ్యాన్

ఆన్ లైన్ బెట్టింగ్, జూదంపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ పెట్టింది. వీటితో సంబంధం ఉన్న 242 వెబ్సైట్లను బ్లాక్ చేసింది. బెట్టింగ్, జూదాన్ని ప్రమోట్ చేస్తున్న దాదాపు 8వేల వెబ్సైట్లపై ఇప్పట

242 బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం బ్యాన్
ఆన్ లైన్ బెట్టింగ్, జూదంపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ పెట్టింది. వీటితో సంబంధం ఉన్న 242 వెబ్సైట్లను బ్లాక్ చేసింది. బెట్టింగ్, జూదాన్ని ప్రమోట్ చేస్తున్న దాదాపు 8వేల వెబ్సైట్లపై ఇప్పటి వరకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇటీవల రియల్మనీ గేమింగ్ యాప్లను నిషేధించిన కేంద్రం.. వెబ్సైట్లపైనా దృష్టి సారించింది. బెట్టింగ్, ఆన్లైన్ జూదం కారణంగా యువత పెడదోవ పట్టడం, ఆర్థికంగా చితికిపోతున్నట్లు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అక్టోబర్లో ఆన్లైన్ గేమింగ్ యాక్ట్, 2025ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నగదుతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ను నిషేధించింది. దీంతో వింజో, నజారా టెక్నాలజీస్ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ రియల్ మనీ గేమ్స్ కు స్వస్తి చెప్పాయి.
India Government
Online Betting
Online Gambling
Central Government
Website Ban
Gaming Regulation
Real Money Games
Online Gaming Act 2025
Youth Protection
Digital Crackdown
Scroll for the next article