News29th Sep 11:58 AMSunil Byrisetty1 min read
గడ్డి మందుపై నిషేధం.. కేంద్రం ఉత్తర్వులు
మనుషులు, జంతువుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు సంహారకం (హెర్బిసైడ్) పారాక్వాట్ డైక్లోరైడ్ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోక
మనుషులు, జంతువుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు సంహారకం (హెర్బిసైడ్) పారాక్వాట్ డైక్లోరైడ్ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఈ రసాయనాన్ని నిషేధించిన దాదాపు 70 దేశాల సరసన భారత్ చేరింది. ఈ గడ్డి మందు సులభంగా దొరుకుతుండటంతో ఆత్మహత్యలకు పాల్పడేవారు దీన్ని తీసుకుంటున్నారు. ఇది తీసుకున్న తర్వాత ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యంగా మారుతోంది. దీంతో నిపుణుల కమిటీ సిఫార్సుల అనంతరం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పారాక్వాట్ డైక్లోరైడ్ కొత్త రిజిస్ట్రేషన్లపై తక్షణ నిషేధం అమల్లోకి రావడమే కాకుండా, గతంలో జారీ చేసిన పాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లన్నింటినీ రద్దు చేశారు. జులై 10న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి, 30 రోజుల పాటు సలహాలు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత కేంద్రం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.