News10th Aug 10:59 AMSunil Byrisetty1 min read

విశాఖ, విజయవాడ మెట్రోపై కసరత్తు

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నివేదికలపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపు జరుపుతోంది. రెండు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్‌లపై ఆర్థిక అంచనాలను రూపొంద

విశాఖ, విజయవాడ మెట్రోపై కసరత్తు
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నివేదికలపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపు జరుపుతోంది. రెండు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్‌లపై ఆర్థిక అంచనాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత విభాగానికి పంపింది. రెండు నగరాల్లో రూ.21,616 కోట్లతో 84.63 కి.మీ మెట్రో నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలున్నాయి. రెండు డీపీఆర్‌లను కూటమి ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అభ్యంతరాలు, సూచనల అనంతరం ఆర్థిక మదింపునకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ రానుంది. ఈ ప్రక్రియ అనంతరం ఏపీ ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.
Andhra Pradesh
AP Infrastructure
Visakhapatnam Metro
Vijayawada Metro
Metro Rail
Urban Development
Central Government
డీపీఆర్
ఆర్థిక మదింపు
మెట్రో ప్రాజెక్టులు
విశాఖపట్నం
విజయవాడ
ప్రజా రవాణా
Scroll for the next article