Crime13th Aug 03:13 PMSunil Byrisetty1 min read

మోసపూరిత లోన్ యాప్‌లు బ్లాక్

లోన్ యాప్‌ల ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలతో మోసపూరిత రుణ యాప్‌లను బ్లాక్ చేసింది. మొత్తం 3,718 మొబైల్‌ యాప్‌లకు చెక్ పెట్టింది. ఈ

మోసపూరిత లోన్ యాప్‌లు బ్లాక్
లోన్ యాప్‌ల ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలతో మోసపూరిత రుణ యాప్‌లను బ్లాక్ చేసింది. మొత్తం 3,718 మొబైల్‌ యాప్‌లకు చెక్ పెట్టింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం మోసపూరిత రుణ యాప్‌లతో సహా మొత్తం 3,718 మొబైల్‌ యాప్‌లను భారతీయ సైబర్‌ క్రైమ్‌ సమన్వయ సెంటర్‌ నిలిపివేసిందనితెలిపారు. పోలీసు విభాగాల నివేదికల ప్రకారం 15.75 లక్షలకు పైగా సిమ్‌ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను కేంద్రం బ్లాక్‌ చేసిందని మంత్రి పేర్కొన్నారు.
Cybercrime
Mobile Apps
App Blocking
Loan Apps
Fraudulent Loan Apps
Central Government
Bandi Sanjay
Indian Cybercrime Coordination Centre
I4C
SIM Cards
IMEI Numbers
Scroll for the next article