News22nd Jul 10:13 AMSunil Byrisetty1 min read

ఉపాధి హామీలో నయా నిబంధనలు?

ఉపాధి హామీ పనులపై కేంద్రం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇకపై కూలీలకు డబ్బులు రావాలంటే పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. నేషనల్ మోబైల్ మానిటరింగ్

ఉపాధి హామీలో నయా నిబంధనలు?
ఉపాధి హామీ పనులపై కేంద్రం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇకపై కూలీలకు డబ్బులు రావాలంటే పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో కార్మికుల ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫొటో ఉదయం 9గంటలకు తీసి అప్ లోడ్ చేయాలి. తర్వాతి ఫొటో సాయంత్రం 4గంటలకు తర్వాత తీయాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఈ ఫొటోలను పంచాయతీ సెక్రెటరీలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలు సరిగ్గా తీశారు, ఎన్ని తియ్యలేదని అనేవి చెక్ చేయాలి. గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20 శాతం వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫొటోను భద్రపరచాలి.
India news
MGNREGA
Employment Guarantee Scheme
NREGA new rules
Central government guidelines
Worker photo rule
National Mobile Monitoring System
Panchayat Secretary
Field Assistant
Rural Employment
ఉపాధి హామీ కొత్త మార్గదర్శకాలు
Scroll for the next article