Telangana2nd Jan 04:43 PMSunil Byrisetty1 min read
నదీజలాల వివాదాలపై కమిటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. కృష్ణానది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023నాడు KWDT-2ను ఏర్పాటు చేసి.. అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను నిర్దేశించింది. రెండేళ్ల కాల వ్యవధి 1 ఆగస్టు, 2025 నాడు ముగియగా.. కృష్ణాజలాల వినియోగంపై వాదనలు నడుస్తున్నందున.. దీన్ని మరో ఏడాది (31 జూలై, 2026) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తోంది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి.. జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్), చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. వీరితోపాటుగా.. కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) చీఫ్ ఇంజనీర్, CWC చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉంటారు.