News30th Jan 12:54 PMSunil Byrisetty1 min read
పిల్లలను మభ్యపెట్టే ప్రకటనలకు చెక్!
దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు కళ్ళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘ఆర్ధిక సర్వే’ ఒక వి
దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు కళ్ళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘ఆర్ధిక సర్వే’ ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. చిన్నారులను ఆకర్షించే జంక్‌ఫుడ్ ప్రకటనలపై ఉదయం నుంచి రాత్రి వరకు నిషేధం విధించాలని సూచించింది. కేవలం జంక్‌ఫుడ్ మాత్రమే కాదు, పసిపిల్లల పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌పైనా కొరడా ఝుళిపించాలని సిఫార్సు చేసింది. పిల్లలు టీవీలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలను ఎక్కువగా వీక్షించే సమయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో పిల్లలను ఆకట్టుకునేలా జంక్‌ఫుడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు, ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య టీవీలు, ఓటీటీలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో జంక్ ఫుడ్ ప్రకటనలను పూర్తిగా నిషేధించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇది అమలైతే పిల్లల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పు వస్తుందని అంచనాలున్నాయి.