Education24th Jul 04:42 PMSunil Byrisetty1 min read

నీట్ నేపథ్యంలో.. లీక్ చేస్తే జైలు, జరిమానా!

నీట్ పేపర్ లీక్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇంద

నీట్ నేపథ్యంలో.. లీక్ చేస్తే జైలు, జరిమానా!
నీట్ పేపర్ లీక్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లీక్ ఘటనల్లో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును క్యాబినెట్ ఆమోదించగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పేపర్ లీకులపై విచారణకు ఫాస్టాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. వీటి ద్వారా లీకులకు సంబంధించిన కేసుల విచారణను మూడు నెలల్లో పూర్తిచేసి దోషులకు శిక్ష విధించేలా ప్రతిపాదనలు చేశారు.
India
NEET
NEET Paper Leak
Paper Leak
Exam Reforms
Narendra Modi
Union Cabinet
Fast-Track Courts
Education
పరీక్షల సంస్కరణలు
విద్యార్థులు
పోటీ పరీక్షలు
జైలు శిక్ష
జరిమానా
Scroll for the next article