News5th Aug 05:40 PMSunil Byrisetty1 min read
ఏపీకి వచ్చిన పెట్టుబడి లెక్కలు ఇవే!
ఏపీకి పెట్టుబడులపై లోక్‌సభలో లెక్కలతో సహా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ ప్రశ్నకు స్పష్టత ఇచ్చింది. జగన్ హయాం కంటే కూటమి పాలనలో భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు
ఏపీకి పెట్టుబడులపై లోక్‌సభలో లెక్కలతో సహా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ ప్రశ్నకు స్పష్టత ఇచ్చింది. జగన్ హయాం కంటే కూటమి పాలనలో భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు తేల్చింది. 2023-24లో రూ.760 కోట్ల FDIలు (92.13 మిలియన్ డాలర్లు) వచ్చినట్లు తేల్చింది. 2024-25 నాటికి FDIల మొత్తం 233.14 మిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించింది. 2025-26 నాటికి ఏకంగా రూ.5వేల కోట్లకు FDIలు చేరాయి. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విధానాల్లో.. అనిశ్చితి వల్ల పెట్టుబడుల ప్రవాహం వెనుకబడింది. 2025-26లో లోహ పరిశ్రమల రంగంలో.. ఆహార శుద్ధి రంగంలో 107.30 మిలియన్ డాలర్లు,.. సిమెంట్ ఉత్పత్తుల రంగంలో 99.90 మిలియన్ డాలర్ల FDIలు వచ్చినట్లు స్పష్టం చేసింది.