National31st Oct 05:04 PMSunil Byrisetty1 min read
పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతి విధానంలో మార్పులు చేసింది. పెట్రోల్ ఎగుమతులపై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ప్రత్యేక సుంకాన్ని పూర్తిగా తొలగించింది. మరోవైపు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతు
కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతి విధానంలో మార్పులు చేసింది. పెట్రోల్ ఎగుమతులపై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ప్రత్యేక సుంకాన్ని పూర్తిగా తొలగించింది. మరోవైపు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై పన్నులను పెంచింది. శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లతో ఈ కొత్త రేట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇంధన ధరలు, దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సవరించిన సుంకాల ప్రకారం.. పెట్రోల్‌పై లీటరుకు ఉన్న రూ.2.50 పన్నును పూర్తిగా ఎత్తివేసింది. డీజిల్ ఎగుమతులపై గతంలో రూ.8.50గా ఉన్న సుంకాన్ని రూ.11.50కి పెంచింది. అంటే లీటరుకు రూ.3 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై సుంకాన్ని రూ.10.50 నుంచి రూ.11కు పెంచింది. దీనివల్ల లీటరుకు 50 పైసల భారం అదనంగా పడనుంది.