News5th Jul 01:06 PMSunil Byrisetty1 min read

అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్

అమరావతి రాజధానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ రుణాన్ని గ్రాంటూగా మార్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రుణాలపై 16వ ఫైనాన్స్ కమిషన్‍కు రాష్ట్రం నోట్ పంపింది.

అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి రాజధానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ రుణాన్ని గ్రాంటూగా మార్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రుణాలపై 16వ ఫైనాన్స్ కమిషన్‍కు రాష్ట్రం నోట్ పంపింది. ఈ నోట్‍లో విదేశీ రుణం వివరాలు కనిపించకపోవడంతో.. రూ.15,000 కోట్ల సాయం ఇస్తామని బడ్జెట్‍లో కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీంతో రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మరోవైపు హడ్కో నుంచి మరో రూ.11,000 కోట్ల రుణం రాష్ట్రానికి అందనుంది. కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంపై రుణ భారం తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఏడాదికి రూ.34,998 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఏపీపై వడ్డీ భారం తగ్గి ఉపశమనం లభించనుంది.
Andhra Pradesh news
Amaravati development
Central govt
fiscal relief watch
Amaravati Funds
హడ్కో నుంచి మరో రూ.11
000 కోట్ల రుణం
కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంపై రుణ భారం తగ్గింపు
Scroll for the next article