Health9th Nov 03:38 PMSunil Byrisetty1 min read
క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం నిర్ణయం!
క్యాన్సర్ మందుల ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మందుల ధరలను భారీగా తగ్గించింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ట్రేడ్ మార్జిన్‌లపై పరిమితులు విధించడంతో నేటి నుంచ
క్యాన్సర్ మందుల ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మందుల ధరలను భారీగా తగ్గించింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ట్రేడ్ మార్జిన్‌లపై పరిమితులు విధించడంతో నేటి నుంచి ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. 137 రకాల క్యాన్సర్ నిరోధక మందులపై గరిష్ట ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేశారు. కొన్ని బ్రాండ్ల మందుల ధరలు 70 శాతం నుంచి 96 శాతం వరకు తగ్గాయి. పాల్‌బోప్రో 125mg: పాత ధర రూ. 40,412 నుండి రూ. 2,720 కు తగ్గింది.
• బెవాసిజాబ్ (4 ml): పాత ధర రూ. 21,767 నుండి రూ. 5,930 కు తగ్గింది.
• ఫుల్‌వెస్ట్రాంట్ / ఫుల్‌బ్రెకా: పాత ధర రూ. 26,072 నుండి రూ. 5,491 కు తగ్గింది.
• అజాసిటిడిన్: పాత ధర రూ. 6,337 నుండి రూ. 1,495 కు తగ్గింది. మెడికల్ షాపుల్లో ఎవరైనా పాత లేదా ఎక్కువ ధరలకు అమ్మితే 1800-111-255 టోల్-ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని NPPA సూచించింది.