News13th Jan 04:33 PMSunil Byrisetty1 min read
గిగ్ వర్కర్ల క్షేమం కోసం.. '10 నిమిషాలకు' చెక్!
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పది నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్ కామర్స్ సేవలపై కీలక అప్డేట్ వచ్చింది. గిగ్ కార్మికుల రక్షణ, భద్రత, మెరుగైన పని పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కేంద్ర
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పది నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్ కామర్స్ సేవలపై కీలక అప్డేట్ వచ్చింది. గిగ్ కార్మికుల రక్షణ, భద్రత, మెరుగైన పని పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు క్విక్ కామర్స్ సంస్థలు ఈ మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నాయి. క్విక్ డెలివరీ తొలగింపు అంశంతోపాటు పలు డిమాండ్లతో గిగ్ వర్కర్లు ఇటీవల దేశవ్యాప్త సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీంతో వర్కర్ల భద్రతా దృష్ట్యా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహా పలు క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా పది నిమిషాల నిబంధనను తొలగించేలా ఆయా సంస్థలను ఒప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బ్లింకిట్ ఇప్పటికే పది నిమిషాల నిబంధనను తొలగించింది. 10 నిమిషాల డెలివరీ టార్గెట్ వల్ల గిగ్ కార్మికులు తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోంది. దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాకుండా వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.