Technology21st Dec 10:29 AMSunil Byrisetty1 min read
చాట్ జీపీటీతో భద్రతకు ముప్పు!
కేంద్ర ప్రభుత్వం ఏఐ టూల్స్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వీటిని ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. చాట్ జీపీటీ లాంటి ఏఐ ఫ్లాట్‌ఫామ్స్ వాడటం సమాచార భద్రతకి ముప్
కేంద్ర ప్రభుత్వం ఏఐ టూల్స్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వీటిని ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. చాట్ జీపీటీ లాంటి ఏఐ ఫ్లాట్‌ఫామ్స్ వాడటం సమాచార భద్రతకి ముప్పు అని హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఏఐ టూల్స్ వాడటం వల్ల ఇతర దేశాలకు రహస్య సమాచారం తెలిసే అవకాశముందని, భద్రత దృష్ట్యా వాటిని వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెవరూ సమాచారాన్ని ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయవద్దని హెచ్చరించింది. దేశంలో ఏం జరుగుతుంది..? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? చేపట్టబోయే పనులు ఏంటి? లాంటి కీలక సమాచారం లీక్ అయ్యే ప్రమాదముందని అలర్ట్ జారీ చేసింది. ఏఐ సంస్థలు వీటిని పక్క దేశాలకు షేర్ చేసే అవకాశముందని హెచ్చరించింది.