Politics24th Jul 03:48 PMSunil Byrisetty1 min read
CJPతో ముగిసిన కేంద్రమంత్రుల చర్చలు
CJPతో కేంద్రమంత్రుల చర్చలు ముగిశాయి. 3 డిమాండ్లను కేంద్రమంత్రుల ముందు ఉంచినట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉందన
CJPతో కేంద్రమంత్రుల చర్చలు ముగిశాయి. 3 డిమాండ్లను కేంద్రమంత్రుల ముందు ఉంచినట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరామన్నారు. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని చెప్పామని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. రేపు మరోసారి కేంద్రంతో చర్చలు జరుపుతామని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.