National16th Aug 03:29 PMSunil Byrisetty1 min read

రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించటమనే అంశంపై కేంద్రం స్పందించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రా

రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించటమనే అంశంపై కేంద్రం స్పందించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించేలా కోర్టులు నిర్దేశించలేవని సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. బిల్లులపై గడువు విధింపుతో రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. ఆ రెండు స్థానాలు ప్రజాస్వామ్య పాలనకు ఉన్నత ఆదర్శాలు అని చెప్పిన కేంద్రం.. వారి విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే న్యాయ జోక్యాల కంటే.. రాజ్యాంగపరమైన యంత్రాంగం ద్వారా సరిదిద్దాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
India news
Central Government
Supreme Court
Governors
President of India
Bill Approval
Constitutional Powers
Judicial Intervention
న్యాయ జోక్యం
రాష్ట్ర అసెంబ్లీలు
ప్రజాస్వామ్యం
Scroll for the next article