News26th May 11:11 AMSunil Byrisetty1 min read
పన్నులు తగ్గించకపోతే ఆందోళనలు
ప్రజలపై ఇంటిపన్ను, ఆస్తి పన్ను, విద్యుత్ పన్నులు తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప
ప్రజలపై ఇంటిపన్ను, ఆస్తి పన్ను, విద్యుత్ పన్నులు తగ్గించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12కు సంవత్సరం కాబోతుందన్నారు.
కడపలో మహానాడు ప్రారంభం కాబోతోందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక ఇంటి పన్ను,ఆస్తి పన్నుల పెంపు అని ఎద్దేవా చేశారు.
.సుమారు 35 శాతం ఇంటిపన్నులు పెరిగాయన్నారు. ప్రజలపై భారాలు 784 కోట్లు వారి లక్ష్యమని, 1500 కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.
బాదుడే బాదుడు అన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది ఏంటని ప్రశ్నించారు.
గత వైసిపి ప్రభుత్వం మాదిరి కూటమి ప్రభుత్వం నడుస్తుందన్నారు.
పన్నులు తగ్గించకపోతే ఆందోళనలకు దిగుతామని సిపిఎం నేత హెచ్చరించారు.