News14th Jul 10:53 AMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మ సేవలో చాగంటి!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరావు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరావు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక పురాణ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారులు (విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు) సోమవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం కు విచ్చేసి దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ వారికి ఘన స్వాగతం పలికి అన్ని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితులు చాగంటి కోటేశ్వరావు దంపతులకు వేదాశీస్సులు అందజేశారు. శ్రీ అమ్మవారి చిత్రపటం, అమ్మవారి ప్రసాదములు ఈవో అందజేశారు.