News11th Sep 12:30 PMSunil Byrisetty1 min read
అనకాపల్లిలో చాయ్ పే చర్చ
అనకాపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ చాయ్ పే చర్చ కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ పాల్గొన
అనకాపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ చాయ్ పే చర్చ కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రముఖులు, స్థానికులు తమ సమస్యలను వివరిస్తూ నేతలతో ముఖాముఖిగా చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్, మురుగు నీటి సమస్యలు, ప్రజా సౌకర్యాల లోపాలు వంటి దీర్ఘకాలిక సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.ప్రజలతోపాటు స్థానికంగా పాల్గొన్న వాకర్స్ నుంచి కూడా నేతలు స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలను శ్రద్ధగా విని, పరిష్కార మార్గాలపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.