Spiritual18th Jan 12:47 PMSunil Byrisetty1 min read
దుర్గగుడిలో వైభవంగా చండీ హోమం
విజయవాడ దుర్గ గుడిలో అత్యంత వైభవంగా చండీ హోమం నిర్వహించారు. అమావాస్య, ఆదివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున చండీ హోమంలో పాల్గొన్నారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్ర
విజయవాడ దుర్గ గుడిలో అత్యంత వైభవంగా చండీ హోమం నిర్వహించారు. అమావాస్య, ఆదివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున చండీ హోమంలో పాల్గొన్నారు.
అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో జరిగిన ఈ విశేష చండి హోమంలో మొత్తం 233 మంది భక్తులు పాల్గొని చండీ హోమ పూజలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న 91 మంది భక్తుల పేర్ల మీద అర్చకులు పరోక్షంగా ఈ చండీ హోమ పూజలను జరిపించారు. యాగశాల భక్తులతో కిక్కిరిసిపోయి, ఆధ్యాత్మిక శోభతో అలరారింది.