National4th Aug 05:15 PMSunil Byrisetty1 min read

పిల్లలపై వైరస్ అటాక్.. గుజరాత్‌లో హై అలర్ట్!

గుజరాత్‌లో అరుదైన చండీపుర వైరస్(చాందీపుర) వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 184 అనుమానిత కేసులు నమోదయ్యాయి.

పిల్లలపై వైరస్ అటాక్.. గుజరాత్‌లో హై అలర్ట్!
గుజరాత్‌లో అరుదైన చండీపుర వైరస్(చాందీపుర) వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 184 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారిలో 35 మందికి చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గాంధీనగర్, సబర్కాంత-హిమ్మత్‌నగర్, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. వైరస్ సోకిన కేసులన్నీ 15 ఏళ్లలోపు పిల్లల్లోనే కావడం భయపెడుతోంది. వైరస్‌ వ్యాప్తికి ఇసుక ఈగలే కారణమని గుర్తించి, భారీగా పురుగుమందుల పిచికారీ చేపట్టారు. తీవ్ర జ్వరం, వాంతులు, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని వైద్య శాఖ సూచించింది. చండీపుర వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ ఔషధం అందుబాటులో లేదు. కాబట్టి ముందుజాగ్రత్త నివారణ చర్యలపై దృష్టి సారించారు.
India health
Chandipura Virus
Gujarat
Health Alert
Viral Infection
Children
ప్రజారోగ్యం
ఇసుక ఈగలు
ఎన్సెఫలైటిస్
వైరస్ వ్యాప్తి
ఆరోగ్య శాఖ
Scroll for the next article