News3rd Jul 11:56 AMSunil Byrisetty1 min read
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు: సీఎం చంద్రబాబు
బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని, కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అవి కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని
బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని, కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అవి కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తన నివాసంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం సమైక్యాంధ్రలో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తానే తీసుకొచ్చానని గుర్తు చేశారు. శ్రీశైలం, ఎస్ఎల్‌బీసీ, మాధవరెడ్డి కెనాల్ చూసిన తర్వాత దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్‌ను గోదావరి నదిపైన కట్టామన్నారు. గోదావరిలో ఉన్న నీటిని పై రాష్ట్రంతోపాటు కింద రాష్ట్రం కూడా వాడుకోవచ్చని పేర్కొన్నారు. వంద సంవత్సరాలుగా 2000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని, వాటిలో 200 టీఎంసీల నీటిని తెలంగాణ కానీ, ఏపీ కానీ వినియోగించుకుంటే ఇరు రాష్ట్రాలు బాగుంటాయని సూచించారు. నీటి సమస్య పరిష్కారమై తెలుగు సమాజం బాగుపడుతుందని పదేపదే చెబుతున్నానని అన్నారు. గోదావరి నదిపై తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులను తానెప్పుడూ వ్యతిరేకించలేదని, వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు.