Crime11th Mar 03:32 PMSunil Byrisetty1 min read
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం: సీఎం చంద్రబాబు
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారన్నారు. అసెంబ్లీలో ఇప్పుడు బూతులు లేవని, చ
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారన్నారు.
అసెంబ్లీలో ఇప్పుడు బూతులు లేవని, చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో రౌడీయిజం చేసేవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
భూ కబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం తీసుకొస్తున్నామని వెల్లడించారు.
డ్రోన్ పెట్రోలింగ్, సీసీ కెమెరాలు పెడుతున్నామని, సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేస్తామని వివరించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని, అయినా రాజకీయ కక్షసాధింపు చర్యలకు తాను వ్యతిరేకమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.