News26th Jul 02:53 PMSunil Byrisetty1 min read
కాణిపాకం గణేశుడి సేవలో గోయల్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ దర్శించుకున్నారు. జిల్లాలో రెండు రోజుల ప్రకటనలో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ దర్శించుకున్నారు. జిల్లాలో రెండు రోజుల ప్రకటనలో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. కాణిపాకం విచ్చేసిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాణిపాకం అతిథి గృహం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులకు ఆలయం ముఖ ద్వారం వద్ద ఆలయ ఈవో పెంచల కిషోర్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం కేంద్ర సాధికార కమిటీ సభ్యులకు ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ భరణి తదితరులు పాల్గొన్నారు.